Webdunia - Bharat's app for daily news and videos

Install App

`చుట్టాలబ్బాయి`తో ఎం. వీర‌భ‌ద్రం భారీ చిత్రం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:36 IST)
Verabadram, aadi, trirupati reddy, manmadarao
ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `చుట్టాలబ్బాయి` సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా  ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ, ఆదితో నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `చుట్టాల‌బ్బాయి` మంచి హిట్ అయింది. ప్ర‌స్తుతం మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో అధ్భుత‌మైన విజ‌యాన్ని సాధించే సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాం. స‌బ్జెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌రో మంచి హిట్ సినిమా అవుతుంది. నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు మంచి అభిరుచి ఉన్న నిర్మాత‌లు. ఒక సూప‌ర్‌హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వారి నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువ‌స్తాం``అన్నారు .
ఆది సాయి కుమార్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి బ్యాన‌ర్‌: విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్‌
నిర్మాత‌లు: నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు క‌థ‌, స్క్రీన్ ప్లే,ద‌ర్శ‌క‌త్వం: ఎం.వీరభద్రం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments