Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృదేవోభవ రీమేక్.. నయన, అనుష్క, కీర్తి సురేష్‌లలో ఎవరు..?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:57 IST)
తెలుగులో విజయవంతమైన చిత్రాలలో మాతృదేవోభవ ఒకటి. కె.ఎస్.రామారావు నిర్మాత. అజయ్ కుమార్ కె ఈ చిత్ర దర్శకుడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిర్మాత, దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు నిర్మాత, దర్శకుడు ఇటీవల తెరవెనుక కథలు అనే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటర్వ్యూలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, నయనతార ప్రధాన పాత్రతో ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మొదటి ఎంపిక నయనతారేనని, అనుష్కతో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి సరిపోతారని ఆయన అన్నారు.
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత ఇంకా తుది పిలుపునివ్వలేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments