ప్రభాస్‌కు సంబంధించిన కొత్త వార్త అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికీ బాలీవుడ్‌లో షూటింగ్ నిమిత్తం సెటిల్ అయినా ఆయన్ను బాలీవుడ్ స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి ప్రభాస్‌ను తీసుకెళ్ళానేలా ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. హాలీవుడ్‌లో సంచలనం రేపిన రాంబో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు దర్శకుడు సిద్ధార్త్ ఆనంద్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఈ బ్లాక్‌బస్టర్ రీమేక్ కోసం హీరో అన్వేషణలో మొదట హీరోగా టైగర్ ష్రాఫ్‌ని అనుకున్నారట. రాంబో పాత్రలో నటించేందుకు కావాల్సిన ఫిజిక్ టైగర్ ష్రాఫ్ లో ఉండటంతో అతనే ఈ పాత్రకి పర్‌ఫెక్ట్ అని దర్శకుడు భావించాడట !
కానీ ఇప్పుడు ఎందుకో ఈ దర్శకుడు మనసు మార్చుకుని రాంబో పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌కి దర్శకుడు సిద్ధార్త్ స్క్రిప్ట్ కూడా వినిపించాడని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై ప్రభాస్ ఎలాంటి సమాధానం ఇచ్చాడన్నది తెలియాల్సి ఉంది . ఒకవేళ ఈ ప్రాజెక్టే ఓకే అయితే ప్రభాస్‌కు హాలీవుడ్ రేంజ్‌లో స్టార్‌డమ్ ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.