Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా..త్' అంటూ బూతులు మాట్లాడేసిన నాగార్జున.. వైల్డ్ డాగ్ ట్రైలర్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:57 IST)
Wild Dog
కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ఇంతకు ముందు క్షణం, ఘాజీ సినిమాలతో ఆకట్టుకున్నారు. అహిషోర్ సాల్మోన్ డైరెక్టర్ గా చేస్తున్నారు.
 
ఇక ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్‌లో నాగార్జున ఆకట్టుకున్నారు. ఉగ్రవాదులతో పోరాటాలు ఆకట్టుకున్నాయి. నన్ను అరెస్టు చేయండి అని ఓ ఉగ్రవాది అనగా, గన్‌తో కాల్చిపారేస్తాడు నాగర్జున. 
 
అంటే ఈ సినిమా అంతా ఫుల్ ప్యాక్ డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకోబోతోంది. నాగార్జున 'వైల్డ్ డాగ్' ట్రైలర్ రివ్యూ.. యాక్షన్ అదిరింది బాసూ.. అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాగార్జున కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి. కశ్మీర్ లోకేషన్స్‌ లో కూడా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాల్మాన్. ట్రైలర్ విడుదలయ్యే ముందు వరకు కూడా ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు ఆసక్తి పెరిగిపోవడం ఖాయం. 
 
నాగర్జునతో పాటు సైయమి ఖేర్, ప్రకాశ్ సుదర్శన్ తోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రాజా కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ముందుగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయాలనుకున్నాడు నాగార్జున. 
 
ఈ క్రమంలోనే రూ.25 కోట్లు డీల్ కూడా మాట్లాడుకున్నారు నిర్మాతలు. కానీ చివరి నిమిషంలో అగ్రిమెంట్ క్యాన్సల్ చేసి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మాన్ 'వైల్డ్ డాగ్' సినిమాను తెరకెక్కించాడు. 
 
గోకుల్ ఛాట్ పేలుళ్లతో పాటు మరికొన్ని అటాక్స్‌ను ఇతివృత్తంగా తీసుకుని ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. దానికి తగ్గట్లుగానే సినిమాను కూడా అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించాడు. ఒకడు మన దేశంలో వందల మందిని చంపి మీరేమీ చేయలేరు అంటే.. నేను అందుకు అంగీకరించను అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఆ వెంటనే 'మా..త్' అంటూ బూతులు కూడా మాట్లాడేశాడు నాగార్జున. 

ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి రియాక్షన్ కూడా అదిరిపోయింది. ఎప్పట్లాగే తన సోదరుడు నాగార్జున ఇందులో చాలా కూల్‌గా.. ఎనర్జిటిక్‌గా కనిపించాడు.. ఏ జోనర్‌ సినిమా అయినా చేయడానికైనా భయం లేకుండా ముందడుగు వేసే నటుడు అతను అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రైలర్‌ను ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments