Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్ బ‌యోపిక్‌కి యాత్ర అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం..?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (20:48 IST)
వై.ఎస్ బ‌యోపిక్‌ని యాత్ర టైటిల్‌తో రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి పోషించారు. ఆనందో బ్ర‌హ్మ ఫేమ్ మ‌హి వి రాఘ‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. అయితే... ఈ సినిమాకి టైటిల్ వై.ఎస్.ఆర్ అని పెట్ట‌చ్చు క‌దా..? యాత్ర అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి అని చాలామంది అనుకుంటున్నారు.
 
ఇదే ప్ర‌శ్న డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ‌న్‌ని అడిగితే... యాత్ర అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే... మనిషి తనను తాను చూసుకునే.. లోపలికి చేసే యాత్ర. బయోపిక్‌ అన్న సంగతి పక్కన పెట్టండి. ఓ పర్సన్‌ యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేసరికి వచ్చిన మార్పు. ఇంకా చెప్పాలంటే... బేసిక్‌ ఓ రోడ్‌ మూవీ మాదిరిగా కూడా. అందుకే ఈ సినిమాకు యాత్ర అని పేరుపెట్టాం అని తెలియ‌చేసారు. డైరెక్ట‌ర్ చెప్పిన దాన్నిబ‌ట్టి చూస్తే... ఆడియ‌న్స్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంది. మ‌రి... ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments