Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ డిస్కోరాజా రిలీజ్ వాయిదా ప‌డటానికి కార‌ణం ఎవ‌రు..?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (21:08 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రానికి విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీసే విఐ ఆనంద్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేయాలి అనుకున్నారు. డిసెంబ‌ర్ 20 రిలీజ్ అని కూడా ఎనౌన్స్ చేసారు.
 
అయితే.. ఇప్పుడు ఈ సినిమాని ర‌వితేజ పుట్టిన‌రోజు కానుక‌గా జ‌న‌వ‌రి 24న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కార‌ణం ఏంటంటే... డిసెంబ‌ర్ 20న బాల‌య్య రూల‌ర్,సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌తిరోజు పండ‌గే సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు వెంకీమామ కూడా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. అందుక‌నే డిస్కోరాజా సినిమాని వాయిదా వేసార‌ని... దీని వెన‌క సురేష్ బాబు ఉన్నార‌ని తెలిసింది.
 
ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారంలో డిస్కోరాజా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది. మ‌రి.. వ‌రుస ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మౌతోన్న ర‌వితేజ‌కు ఇదైనా విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments