Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరితెగించేస్తున్న 'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు'

'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు' అంటే ఎవరు అనుకుంటున్నారా?? అదెవరో కాదండి.. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ అడ్వెర్టైజ్‌మెంట్‌లో వచ్చే నటీమణులు 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సినిమాలు తగు స్థాయిలో ఆడటం లేదు. కెరీర్ ప్రారంభంలోనే

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (16:30 IST)
'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు' అంటే ఎవరు అనుకుంటున్నారా?? అదెవరో కాదండి.. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ అడ్వెర్టైజ్‌మెంట్‌లో వచ్చే నటీమణులు 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సినిమాలు తగు స్థాయిలో ఆడటం లేదు. కెరీర్ ప్రారంభంలోనే హిందీలో 'హృతిక్ రోషన్' ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామలకు చేదు అనుభవమే మిగిలింది. అందులో యామీ గౌతమ్ 'కాబిల్' అనే చిత్రంలో, పూజా హెగ్డే 'మొహెంజోదారో' అనే చిత్రాల్లో హృతిక్ సరసన నటించినప్పటికీ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. 
 
తెలుగులోనూ అడపాదడపా నటించిన ఈ ముద్దుగుమ్మలకు ఇక్కడా చేదు అనుభవమే మిగిలింది. యామీ గౌతమ్ తెలుగులో 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్ సరసన నటించింది. పూజా హెగ్డే 'ముకుందా', 'ఒక లైలా కోసం', 'డీజే' సినిమాలలో కనిపించింది. పైగా 'డీజే' సినిమాలో బికినీ వేసి కుర్రకారుని ఊరించేసింది. ఆ సినిమాలో ఎక్స్‌పోజింగ్ శృతిమించిపోయిందంటే అతిశయోక్తి కాదు. 
 
ఇన్ని చేసినా ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ దెబ్బకు పూజాకు సినిమాలు కరువై సినీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఇక యామీ గౌతమ్ అయితే ఏకంగా మ్యాక్జిమ్ కవర్‌ పేజీపై అర్థనగ్నంగా ఫోజులిచ్చింది. ఈ భామలను ఆదుకునే నిర్మాతలు, దర్శకులు ఎవరోగానీ, ఇప్పుడైతే మాత్రం పూర్తిగా సినీ అవకాశాల కోసం ఇలా ఫోజులివ్వడంతో బీటౌన్‌తో పాటుగా అభిమానులు సైతం విస్తుపోతున్నారు.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments