Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా వేడుక‌కు బ‌న్నీ ఎందుకు రాలేదు. అస‌లు బ‌న్నీకి ఏమైంది..? (video)

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:20 IST)
బ‌న్నీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. త‌న సినిమా వార్త‌ల‌తో కాదండోయ్. సైరాకి దూరంగా ఉండ‌డం వ‌ల‌న‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఆ మధ్య చెప్పను బ్రదర్‌ అని కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మెగా అభిమానుల్లో ఈ వివాదం ముదిరింది. ఆఖ‌రికి ఏడాదిన్నర తర్వాత ఈ వివాదం ముగిసింది. 
 
పవర్‌స్టార్‌తో కలిసిపోయాడు అల్లు అర్జున్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా జనసేన తరఫున పాలకొల్లు ప్రాంతంలో ప్రచారం చేశాడు. ఆ విధ్యంగా బన్నీ ఫ్యాన్స్‌కి, పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ప్యాచప్‌ అయింది.

మెగా విభేదాలకి దాంతో ప్యాకప్‌ పడింది అని అనుకున్నారంతా. ఇపుడు బ‌న్నీ మ‌రో వివాదానికి తెర తీసిన‌ట్టు అయ్యింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... సైరా సినిమా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాయి. 
 
పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, నాని మొదలుకొని... సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలందరూ ట్వీట్‌ చేశారు. ట్రైల‌ర్ ని మెచ్చుకున్నారు. కానీ... బన్నీ మాత్రం తన సోషల్‌ మీడియాలో ఈ సినిమా ట్రైల‌ర్ ను షేర్‌ చేయలేదు. కామెంట్‌ పెట్టలేదు.
 
ఇదిలా ఉంటే... సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్ ..ఇలా మెగా హీరోలంద‌రూ వ‌చ్చారు కానీ.. బ‌న్నీ రాలేదు. దీంతో మ‌ళ్ళీ మెగా ఫ్యామిలీలో బ‌న్నీ వివాదం మొద‌లైంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అస‌లు.. బ‌న్నీ ఎందుకు సైరా వేడుక‌కు రాలేదు. ప్ర‌చారంలో ఉన్న వార్త‌లు నిజ‌మేనా..?  కాదా..? మ‌రి.. బ‌న్నీ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments