సీఎం జగన్‌‌తో సినీ ప్రముఖుల భేటీ: అక్కినేని నాగార్జున ఎందుకు హాజరు కాలేదంటే?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:20 IST)
టాలీవుడ్‌ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాజమౌళి, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం లేనందుకే నాగార్జున ఈ సమావేశానికి దూరమయ్యారని తెలుస్తోంది.  
 
కాగా అక్కినేని నాగార్జున గతంలోనే సీఎం జగన్‌ను కలిశారు. మూడు నెలల క్రితం నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, ప్రీతం రెడ్డిని వెంటబెట్టుకుని జగన్‌తో సమావేశమయ్యారు. కాగా నేటి సమావేశానికి కూడా ఎక్కువమందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సినీ పెద్దలు కోరారు. 
 
అయితే కొవిడ్‌ కారణంగా తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించడంతోనే పరిమిత సంఖ్యలోనే సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగానే నాగార్జున హాజరుకాలేదని తెలుస్తోంది. 
 
నాగార్జునతో పాటు యంగ్ టైగర్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం టాలీవుడ్‌ సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతుంని మెగాస్టార్‌ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments