Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వ‌క్‌సేన్‌ను తొక్కేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ నిర్మాత ఎవ‌రు?

Webdunia
సోమవారం, 3 మే 2021 (23:19 IST)
Viswak sen ph
సినిమా చ‌రిత్ర‌లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. కొత్త‌గా అవ‌కాశాల కోసం వ‌చ్చిన వారిని ఎవ‌రూ పిలిచి ఇవ్వ‌రుక‌దా.. చూద్దాం. త‌ర్వాత రా. లేదంటే, ట‌చ్‌లో వుండూ.. అనే ప‌దాలు స‌ర్వ‌సాధార‌ణం. అలా చాలామంది టాలెంట్‌ను పైకి రానీయ‌కుండా తొక్కేస్తుంటారు. అందుకే టాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ.. చాలా చోట్ల సెటైర్లు వేస్తుంటారు కూడా. స‌రిగ్గా హీరో విశ్వ‌క్ సేన్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఫ‌ల‌క్‌నామా దాస్ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు అత‌ని గురించి పెద్ద‌గా తెలీదు. ఆ సినిమా రిలీజ్‌కు చాలా క‌ష్టాలు ప‌డ్డాడు. అలాంటి టైమ్‌లో మూడు సినిమాల‌కు అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చిపోయాయి. ఇక ఆ సినిమా టూర్‌కు వెళ్లిన‌ప్పుడు ఓ నిర్మాత అన్న మాట‌లు ఇప్ప‌టికీ ఆయ‌న చెవులో మారుమోగుతూనే వుంటున్నాయి. ఫ‌లక్‌నామా దాస్ సినిమా ఆడియోఫంక్ష‌న్‌కు వ‌స్తుండ‌గా, ఓ నిర్మాత చేసిన కామెంట్ విశ్వ‌క్‌సేన్‌ను భ‌య‌పెట్టాయి. 
 
చాలా క‌ష్ట‌ప‌డి నాన్న‌, స్నేహితులు ఇచ్చిన డ‌బ్బుతోనే సినిమా చేస్తే, నా టాలెంట్‌ను బ‌య‌ట‌కు రాకుండా చేస్తున్నారే అని మ‌ద‌న‌ప‌డ్డాడు. వారంపాటు స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌లేద‌ట‌. ఇంత‌కీ ఆ నిర్మాత ఏమ‌న్నాడంటే.. `ఇప్ప‌టికే ఒక‌డిని ఎక్కించుకున్నాం. వీడిని కూడా నెత్తిమీద పెట్టుకోవాలా? అంటూ విశ్వ‌క్‌సేన్ కు విన‌ప‌డేలా అన‌డం విశేషం. ఈ హ‌టాత్ ప‌రిణానికి విశ్వ‌క్ చాలా రోజులు బాధ‌ప‌డ్డాడు. ఆ సినిమా విడుద‌ల కూడా నానా క‌ష్టాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా విడుద‌ల‌య్యాక తెలిసిందే గ‌దా. మంచి విజ‌యాన్ని సాధించిపెట్టింది. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు విశ్వ‌క్‌. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమా చేశాడు. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. 

సో. సినిమారంగం అనేది ఎవ‌డిబాబు సొత్తుకాదు. అని దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది గ‌దా. మ‌రి `ఇప్ప‌టికే ఒక‌డిని ఎక్కించుకున్నాం` అని ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్మాత అన్నాడో.. పాఠ‌కుల‌కు ఈ పాఠికే అర్థ‌మ‌యివుంటుంది క‌దూ. అయితే ఎంత అడిగినా నిర్మాత పేరు చెప్పక‌పోవ‌డం ఆయ‌న సంస్కారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments