Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ నటుడు ఇమ్మాన్యుయేల్ మామూలోడు కాదుగా..? (video)

Webdunia
సోమవారం, 3 మే 2021 (23:00 IST)
జబర్దస్త్ కామెడీ షో నటుడు ఇమ్మాన్యుయేల్ జెట్ వేగంలో దూసుకుపోతున్నాడు. ఈయన జోరు చూసి మిగిలిన టీమ్ లీడర్స్ కూడా ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ షోతో పాటు బయట ఈవెంట్స్ కూడా కుమ్మేస్తున్నాడు ఈయన. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. 
 
దాంతో పాటు సీరియల్ బ్యూటీ వర్షతో సీరియస్ లవ్ ట్రాక్ కూడా ఈయన్ని హెడ్ లైన్స్‌లో నిలబెడుతుంది. ఎప్పటికప్పుడు వర్షతో ఈయన చేసే రొమాన్స్ హైలైట్ అవుతుంది. దాంతో మనోడు ఆటోమేటిక్‌గా సంచలనం అవుతున్నాడు. 
 
ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు ప్రమోషన్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆది తర్వాత అంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే టీమ్ లీడర్ కూడా కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
 
మరోవైపు.. ఈ మధ్య ఈటీవీ చేసే ప్రతీ ఈవెంట్‌లోనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తున్నాడు. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ వారానికి ఓ భారీ ఎపిసోడ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనే తన టాలెంట్ చూపించాడు ఇమ్మాన్యుయేల్. మదర్స్ డే సందర్భంగా మే 8న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో పాట పాడాడు ఇమ్ము.
 
అందులో గొప్పేముంది అనుకోవచ్చు కానీ లేడీ వాయిస్ కూడా ఈయనే పాడేసాడు. పెదవే పలికిన మాటల్లోనే అంటూ మొదలు పెట్టిన ఇమ్మాన్యుయేల్ మధ్యలో వచ్చే లేడీ వాయిస్‌ను కూడా అచ్చు గుద్దినట్లు దించేసాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఫిదా అయిపోయారు. 
 
హైపర్ ఆది అయితే నీది మామూలు టాలెంట్ కాదురా బాబూ అంటూ గట్టిగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. అందులో ఇమ్మాన్యుయేల్ వాయిస్ కూడా బాగానే వైరల్ అవుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments