Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లైఫ్ స్టోరీ... యాంకర్ నుంచి నటుడిగా ఇలా ఎదిగాడు..

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (12:07 IST)
shanmukh
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ లైఫ్ స్టోరీ ఏంటో చూద్దాం. ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ వాస్తవానికి పేజ్ 3 జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత వీడియో జాకీగా మారాడు. కొన్ని సీరియల్స్‌లో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. ఇప్పుడందరి దృష్టి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి కోటికి పైగా సంపాదించాడు. 
 
వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున 15 వారాల్లో 30 లక్షలు గెల్చుకున్నాడు. ఇక టైటిల్ విన్నర్‌గా 50 లక్షల ప్రైజ్‌మనీ వచ్చింది. మరోవైపు సువర్ణభూమి తరపున 25 లక్షల విలువైన ప్లాట్ దక్కింది. రెండు లక్షల రూపాయల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్ గెల్చుకున్నాడు. 
 
ప్రైజ్‌మనీలోంచి  31.2 శాతం ఆదాయపు పన్ను మినహాయిస్తే..34.40 లక్షలు మాత్రమే చేతికి అందాయి. 15 వారాలకు సంపాదించిన 30 లక్షలు, సువర్ణభూమి ప్లాట్ విలువ, అపాచీ స్పోర్ట్స్ బైక్ కలుపుకుని 1 కోటి 8 లక్షల వరకూ సంపాదించాడని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 5, 2021న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5, 106 రోజుల ప్రయాణాన్ని ఆదివారంతో ముగించుకుంది. ఈ సీజన్‌లో సరయు, ఉమదేవి, లహరి, నటరాజ్, హమీద, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జస్వంత్, అనీ, రవి, ప్రియాంక సింగ్, కాజల్, సన్నీ, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మరియు మానస్ దాని 19 పోటీదారులుగా పాల్గొన్నారు. ఈ షోకు నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా ఉన్నారు. విన్నర్ సన్నీ 1989లో జన్మించాడు. 
 
తెలంగాణలోని ఖమ్మంలో  తన పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఆ తరువాత హైదరాబాదులోని ఉస్మానియా కళాశాలలో బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడు. జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షో కు హోస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా మారాడు. తాజాగా అతడు సకలగుణాభి రామతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments