Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని, భార్యను బూతులు తిడితే ఊరుకోవాలా?: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య వార్ జరుగుతూనే వుంది. ఈ యుద్ధానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరదించుతారా? లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రతీసారీ పవన్‌ను టా

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (12:06 IST)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య వార్ జరుగుతూనే వుంది. ఈ యుద్ధానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరదించుతారా? లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రతీసారీ పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే కత్తి మహేష్ అంటేనే పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
 
ఇటీవల పవన్‌కు మద్దతుగా కత్తిపై హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దీంతో కత్తి మహేష్‌ పవన్, పూనమ్ కౌర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు. అయితే కత్తి సవాలును పూనమ్, పవన్ పట్టించుకోలేదు. అంతే మళ్లీ ప్రెస్ క్లబ్‌లో కత్తి మహేష్.. పవన్‌పై ఫైర్ అయ్యాడు.
 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని కత్తి మహేష్ అన్నాడు. ఆదివారం ప్రెస్ క్లబ్ వేదికగా, మీడియాతో మాట్లాడిన కత్తి పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించాడు. ఫ్యాన్స్‌ను నియంత్రించలేని స్థితిలో పవన్ ఉన్నాడని ఆరోపించాడు. 
 
తాను పవన్ లేదా పూనం కౌర్‌ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని కత్తి మహేష్ ఆరోపించాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించాడు.
 
ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, పవన్, పూనమ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. కానీ వాళ్లిద్దరూ రాలేదని.. తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్తానని.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని స్పష్టం చేశాడు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని కత్తి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments