Webdunia - Bharat's app for daily news and videos

Install App

తంబీ రజినీకాంత్.. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచివున్నాయి... స్మగ్లర్ వీరప్పన్

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (14:31 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఓ విజ్ఞప్తి చేశారు. తంబీ.. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచి ఉన్నాయంటూ చేసిన సూచన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటి.. వీరప్పన్ చనిపోయారు కదా.. ఆయన ఇపుడు రజినీకాంత్‌కు సూచన చేయడమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి... 
 
వీరప్పన్ జీవితంలో చోటు చేసుకున్న అనేక వాస్తవిక అంశాలపై తెరకెక్కిన వెబ్ సిరీస్ 'కూసే మునిసామి వీరప్పన్'. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోను జీ5 తాజాగా విడుదల చేసింది. అందులో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరప్పన్ తనదైనశైలిలో స్పందిస్తారు. ఆయనను దోచుకునేందుకు, మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని హెచ్చరించారు.
 
'ఆయన (ఎంజీఆర్) చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు ఆయనకు తెలుసు. ఎంజీఆర్ వంటి వారు పుట్టడం కష్టం. అయితే, రజినీకాంత్ కూడా ఆయనలా అవుతారని నాకు బాగా తెలుసు. రజినీకాంత్ అందరినీ గౌరవిస్తారు. ఎవరి పట్లా అమర్యాదగా ప్రవర్తించరు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ, ఒక్క విషయం. అయ్యా రజినీకాంత్.. నేను నీతో మాట్లాడుతున్నా.. రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికీ మద్దతు తెలపవద్దు. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్లు వేచి చూస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయ చేసి అమాయకుడిలా బలికావద్దు' అంటూ వీరప్పన్ మాట్లాడిన దృశ్యాలను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments