Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్, కమల్ హాసన్ 21 సంవత్సరాల అపూర్వ కలయిక ఎక్కడో తెలుసా!

Advertiesment
Rajinikanth, Kamal Haasan
, గురువారం, 23 నవంబరు 2023 (17:01 IST)
Rajinikanth, Kamal Haasan
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తమదైన క్రేజ్, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న లెజెండ్రీ యాక్టర్స్ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వీరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. స్టార్స్‌గా ఎదిగే క్రమంలో ఎవరికీ వారు మైల్ స్టోన్ మూవీస్‌తో ఎవరూ అందనంత గొప్ప స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ  ఒకే స్టూడియోలో తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఒకే స్టూడియోలో ఉన్నామని తెలుసుకున్నవారు ఒకరినొకరు కలుసుకుని గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఇలా ఒకే స్టూడియోలో వీరిద్దరూ షూటింగ్స్ జరుపుకోవటం, అక్కడే కలుసుకోవటం జరిగి 21 సంవత్సరాలు అయ్యాయి.
 
webdunia
Rajinikanth, Kamal Haasan
శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. దీనికి సమీపంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో టి.జె. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘తలైవర్ 170’ షూటింగ్ జరుగుతోంది.
 
తన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ జరుగుతోందని తెలిసుకున్న రజినీకాంత్.. తన మిత్రుడు కమల్‌హాసన్‌ని షూటింగ్‌ స్పాట్‌లో కలవటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వనటుడు కమల్ హాసన్.. వెంటనే ఉదయం 8 గంటలకే తలైవర్ 170 షూటింగ్ స్పాట్‌కి వెళ్లి ‘నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వటం విశేషం. చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండ్రీ యాక్టర్స్ కలుసుకుని వారి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇంతకు ముందు బాబా, పంచ తంత్రం షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జెయింట్ మూవీస్ కో ప్రొడ్యూసర్ ఎం. సెంబగ మూర్తి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్ : జానీ మాస్టర్ కితాబు