Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, అమీర్ ఖాన్, రాజ‌మౌళి, నాగార్జున‌, సుకుమార్ క‌లిసిన వేళ‌

Webdunia
గురువారం, 14 జులై 2022 (17:07 IST)
Chiranjeevi, Aamir Khan, Rajamouli, Nagarjuna, Sukumar
ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ స్నేహం చాలా ఏళ్ల‌నాటిది. వారిద్ద‌రిది ప‌ర‌స్ప‌ర గౌర‌వ‌పూర్వ‌క‌మైనబంధం
 
సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్ఢా.  ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మ‌రియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చడ్ఢా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.
 
ఇప్పుడు అమీర్ ఖాన్ తన ప్రియమిత్రుడు మెగాస్టార్ చిరంజీవి మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన లాల్ సింగ్ చ‌డ్ఢా  ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో నిర్వహించారు.
 
ఈ వారం మొద‌ట్లో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్  డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ గార్లు పాల్గొన్నారు. 
 
లాల్ సింగ్ చ‌డ్ఢా ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments