Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

ఠాగూర్
మంగళవారం, 12 ఆగస్టు 2025 (14:23 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'కూలీ'. ఈ నె 14వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో సహా అనేక మంది అగ్రనటులు నటించారు. వీరిలో బాలీవుడ్ నటు అమీర్ ఖాన్, టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, హీరోయిన్ శృతిహాసన్ ఇలా అనేక మంది నటించారు. 
 
అయితే, ఇపుడు వీరికి అందించిన పారితోషికం వివరాలు బహిర్గతమయ్యాయ. ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల మేరకు, ఈ చిత్రంలో దేవా పాత్రను పోషించిన రజనీకాంత్‌కు రూ.200 కోట్లు, అమీర్ ఖాన్‌కు రూ.20 కోట్లు, నాగార్జునకు రూ.10 కోట్లు, సత్యరాజ్‌, ఉపేంద్రలకు రూ.5 కోట్లు, శృతిహాసన్‌కు 4 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు రూ.15 కోట్లు చొప్పున చెల్లించినట్టు సమాచారం. రజనీకాంత్‌కు ఈ చిత్రంలో తొలుత రూ.150 కోట్ల పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో నిర్మాతలు ఆయన పారితోషికాన్ని రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పెంచినట్టు సమాచారం. 
 
మరోవైపు, 'కూలీ' చిత్రం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌లో దూసుకునిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ సేల్స్‌లో రూ.14 కోట్లు వసూలు చేయగా, ఈ నెల 14వ తేదీనే విడుదలవుతున్న వార్-2 చిత్రం కేవలం రూ.2.08 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భా,ల్లో ఈ చిత్రం 6 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా, బ్లాక్ సీట్లతో కలిపితే ఈ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments