Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌మ‌ర యోధుడు కొడుకు క‌బ్జా చేస్తే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:23 IST)
upendra
క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జా’. శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వ‌చ్చింది. అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ఆర్‌.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు.
 
ఉపేంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ‘క‌బ్జా’ టీజ‌ర్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. ఇండియాలో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ క్ర‌మ క్ర‌మంగా ఎలా ఎదిగాడ‌నేదే ‘క‌బ్జా’ చిత్రం. 1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు.
 
చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా  మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
 
క‌న్న‌డ చిత్రాలు కె.జి.య‌ఫ్‌, 777 చార్లి, విక్రాంత్ రోణ‌, కాంతార సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కోవ‌లోకి ‘క‌బ్జా’ చిత్రం వ‌చ్చి చేర‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి మ‌రో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అని భావిస్తున్నారు.
 
కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా శ‌ర‌న్‌, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, క‌బీర్ దుహాన్ సిఒంగ్‌, ద‌నీష్ అక‌ర్త ష‌ఫి, ప్ర‌దీప్ సింగ్ రావ‌త్‌, కృష్ణ ముర‌ళి పోసాని, ప్ర‌మోద్ శెట్టి, అనూప్ రెవ‌న‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.
 
ఎం.టి.బి నాగ‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సిద్ధేశ్వ‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments