Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్యకు ఏమ‌యింది - ఇలా చూపిస్తున్నాడు!

Webdunia
శనివారం, 17 జులై 2021 (19:49 IST)
Nagashourya Sixpack Body
హీరో నాగశౌర్య ఒక్క‌సారిగా మారిపోయాడు. పాండ‌మిక్ త‌ర్వాత ఆయ‌న పూర్తిగా త‌న బాడీని సిక్స్ పేక్‌తో షేప్ చేసుకున్నాడు. జిమ్ శిక్ష‌కుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తయార‌యిన బాడీని శనివారం విడుద‌ల చేశాడు. ఆయ‌న స్టిల్ చూశాక చాలామంది కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. అస‌లు నాగ‌శౌర్య‌కు ఏమ‌యింది. సిక్స్ పాక్‌, ఎయిట్ పాక్ చేసిన‌వాళ్ళు ఎవ‌రూ ఇంత ఇదిగా చూపించ‌లేద‌ని ట్వీట్ చేస్తున్నారు. క‌నీసం డ్రాయ‌ర్ కూడా లేకుండా కిందిభాగం కూడా క‌నిపించి క‌నిపించ‌కుండా చూపించ‌డంప‌ట్ల ప‌లువురు నెటిజన్లు విమ‌ర్శిస్తున్నారు. అస‌లు నాగ‌శౌర్య‌కు ఏమ‌యింది? ఇంత‌కుముందు ఏదో సిక్స్ పేక్ అంటూ విడుద‌ల చేసిన స్టిల్ బాగానే వుంది. కానీ ఈసారి ఇలా చూపించేది క‌రెక్ట్ కాద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి ఆయ‌న ఏం స‌మాధానం చెబుతాడో చూడాలి.
 
అనీష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఐరా క్రియేషన్స్‌ మూవీ ఇటీవ‌లే షూటింగ్ ప్రారంభ‌మైంది. యాక్ష‌న్ క‌థ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments