Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్‌కుమార్ గురించి శివ‌రాజ్‌కుమార్ ఏమ‌న్నారంటే!

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (18:31 IST)
Shiva Raj=Punneth
క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో పునీత్ రాజ్‌కుమార్‌కు ఎంత ఫాలోయింగ్ వుందో తెలిసిందే. ఆయ‌న మ‌ధ్య‌వ‌య‌స్సులోనే చ‌నిపోవ‌డంతో యావ‌త్ దేశం మొత్తం ఆయ‌న అభిమానులు బాధ‌ను వ్య‌క్తం చేశారు. గ‌త‌నెల 29న మ‌ర‌ణించిన పునీత్ రాజ్ కుమార్ 11 రోజుల కార్య‌క్ర‌మం బెంగుళూరులో సోమ‌వారంనాడు జ‌రిగింది. కుటుంబ‌స‌భ్యులు, అభిమానులు, రాజ‌కీయ‌నాయ‌కులు పాల్గొని మ‌రోసారి ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.
 
ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలో ఓ విలేక‌రి ప‌ద్మ‌శ్రీ అవార్డు గురించి ప్ర‌స్తావించ‌గా, వెంట‌నే త‌డుముకోకుండా శివరాజ్‌కుమార్ అన్న మాట‌లు ఆలోచింప‌జేశాయి. పునీత్ మ‌న మ‌ధ్య లేడు. అమ‌రుద‌య్యాడు. అందుకే ఆయ‌న‌కు అమ‌ర‌శ్రీ అనే అవార్డు ఇవ్వ‌డ‌మే బాగుంటుంది. పద్మ‌శ్రీ అనేవి బ‌తికున్న‌వారికి కూడా ఇస్తారు. అన్న ధోర‌ణిలో మాట్లాడారు. ఈ మాట‌ల‌కు అక్క‌డ మీడియా కూడా సమంజ‌సంగా మాట్లాడార‌ని పేర్కొంది. బ‌హుశా ఇంత‌వ‌ర‌కు ఇలా ఎవ‌రూ ఆ మాట అన‌లేద‌ని తెలుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో విజయ్, ఉపేంద్ర, దర్శన్, అభిషేక్ అంబరీష్, బి సరోజా దేవి, సుమలత అంబరీష్, దొడ్డన్న, శ్రీమురళి, విజయ్ రాఘవేంద్ర, ధనంజయ, రక్షిత్ శెట్టి, వి రవిచంద్రన్, అనుశ్రీ, రాజ్ బి శెట్టి, అనుప్ భండారి, నిరూప్ భండారి , శృతి, మాళవిక అవినాష్, చిక్కన్న, గణేష్, జయమాల, రాక్‌లైన్ వెంకటేష్ పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments