Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుకోసం ఏదైనా చేసే రేసర్ గా నిఖిల్ సిద్ధార్థ్‌ ఏం చేశాడు?

డీవీ
మంగళవారం, 5 నవంబరు 2024 (08:02 IST)
Nikhil Siddharth
స్వామి రారా, కేశ‌వ వంటి  స‌క్సెస్‌ల త‌ర్వాత నిఖిల్, సుధీర్ వ‌ర్మ కాంబోలో రూపొందుతోన్నచిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఇటీవలే రిలీజైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా ప్రారంభ‌మైన ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. త‌నకు ల‌వ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వ‌సంత‌న్ డ‌బ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్‌తోనూ మ‌రో ప్రేమ క‌థ ఉంటుంది.
 
రిషికి అనుకోకుండా డ‌బ్బు కోసం మ‌రో ప‌ని చేయ‌డానికి ఒప్పుకుంటాడు. దీంతో అస‌లు గంద‌ర‌గోళం ప్రారంభ‌మ‌వుతుంది. ఓ చచ్చిన వ్య‌క్తిని త‌ర‌లించ‌టానికి రిషి సిద్ధ‌మైన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది. ఓ వైపు పోలీసులు, మ‌రో వైపు గూండాలు అత‌న్ని వెంబ‌డిస్తారు. చాలా స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. అప్పుడు త‌న రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇంత‌కీ రిషి ఎవ‌రి డెడ్ బాడీని త‌ర‌లించాల‌ని అనుకున్నాడు? అజ‌య్‌, జాన్ విజ‌య్.. రిషిని వెంబ‌డించ‌టానికి ఏ ప‌రిక‌రాన్ని వాడుతుంటారు? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
 
ఇదే ట్రైల‌ర్‌లో స‌త్య‌, సుద‌ర్శ‌న్ పాత్ర‌ల‌ను కూడా మ‌నం చూడొచ్చు. న‌రాలు బిగ‌ప‌ట్టేలా చేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ఉండ‌బోతున్నాయి. సినిమాను ఉత్కంఠ‌భ‌రిత‌మైన యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా తెర‌కెక్కించారు. యాక్ష‌న్‌, రొమాన్స్‌, ఫ‌న్ వంటి అంశాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం  న‌వంబ‌ర్ 8న  ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాతో ఓ స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొంద‌నున్నారు.
 
 బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెకంటేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి సంస్థ‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి ప‌రిచ‌యం అవుతున్నారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్‌, షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం స‌హ నిర్మాత‌లు. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాట‌ల‌కు సంగీతాన్ని అందించ‌గా స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. రిచ‌ర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments