Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

ఐవీఆర్
సోమవారం, 16 జూన్ 2025 (13:32 IST)
దంగల్ చిత్రం గురించి చెబితే అందులో నటించిన హీరోయిన్ ఫాతిమా గుర్తుకు వస్తుంది. ఈమె ఇమేజ్ ఆ చిత్రంతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదిలావుంటే ఇటీవల తను నటించిన తాజా చిత్రం విడుదల సమయంలో ఫాతిమా స్టేజిపైన హీరో పక్కన నిలబడి అటూఇటూ కదులుతూ వుంది. ఈ కదలికలపై నెటిజన్లు ఓ రేంజిలో కామెంట్లు కొడుతున్నారు. ఇకపోతే ఫాతిమా ఇటీవల దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. అదికాస్తా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఆమె వ్యాఖ్యలు చేసిందన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మళ్లీ వివరణ ఇచ్చింది.
 
ఫాతిమా మాట్లాడుతూ... దక్షిణ భారత చిత్ర పరిశ్రమ అంటే కాస్టింగ్ కౌచ్ కాదు. నేను ఒక నిర్దిష్ట సంఘటన గురించి మాట్లాడాను, కానీ అది మొత్తం దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా వ్యాప్తి చేయబడింది. నేను ఈ అపోహను తొలగించాలనుకుంటున్నాను. నేను ఒక నిర్దిష్ట సంఘటన గురించి మాట్లాడాను. కొంతమంది పనిగట్టుకుని దానికి కొంచెం మసాలా దట్టించి మొత్తం దక్షిణ భారత పరిశ్రమ ఇలాగే ఉన్నట్లు చూపించారు. ఇది పూర్తిగా అర్ధంలేనిది. అది నిజం కాదు.
 
 
కాగా కొన్ని నెలల క్రితం బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ... ఒక దక్షిణాది చిత్రానికి కాస్టింగ్ ఏజెంట్ నన్ను సంప్రదించి ‘నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా?’ అని అడిగాడు. నేను నా పాత్రను పోషించడానికి అవసరమైన ప్రతిదాన్ని హృదయపూర్వకంగా చేస్తాను అని అన్నాను. కానీ అతను మాత్రం అదిసరే.. దాంతోపాటు నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధమేనా అంటూ అలా చెబుతూనే ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, అతను ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడో, అతడు నాకు ఏమి చెబుతున్నాడో. అతడు ఇంకా నాతో ఇలా చెప్పాడు.
 
హైదరాబాద్‌లో నువ్వు చాలా మందిని కలుసుకోవాలి. వాళ్లు ఏం చెబితే అది చేయాలి. దానికి నువ్వు సిద్ధంగా వున్నావా అని అతడు పదేపదే చెప్పడంతో అతడికి బదులు ఎలా చెప్పాలో అదే చెప్పాను. నాతో అలా ప్రవర్తించిన వ్యక్తి పెద్ద నిర్మాత కాదు, బహుశా ఒక చిన్న నిర్మాణం నుండి వచ్చిన వ్యక్తి. అతని ప్రవర్తన మొత్తం దక్షిణాది పరిశ్రమను ఏ విధంగానూ సూచించదు. కనుక నా వ్యాఖ్యలను మొత్తం దక్షిణాది సినీ ఇండస్ట్రీపై రుద్దకండి అంటూ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments