Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘంట‌సాల బ‌యోపిక్ - అడ్డుకుంటామంటున్న కుటుంబ స‌భ్యులు

తెలుగులో సావిత్రి జీవిత చ‌రిత్ర మ‌హాన‌టి సినిమాగా తెరపై రావ‌డం.. ఇది సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఎన్టీఆర్ పేరుతో రానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:28 IST)
తెలుగులో సావిత్రి జీవిత చ‌రిత్ర మ‌హాన‌టి సినిమాగా తెరపై రావ‌డం.. ఇది సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఎన్టీఆర్ పేరుతో రానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాంతారావు బ‌యోపిక్ కూడా వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ బ‌యోపిక్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఈ నేపథ్యంలోనే ఘంటసాల ది గ్రేట్ అనే టైటిల్‌తో ఆయన బయోపిక్ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇటీవల ఒక వార్త వచ్చింది. ఈ విషయం గురించి ఘంట‌సాల త‌న‌యుడు ర‌త్న‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... ఘంటసాల గారి బయోపిక్‌కి సంబంధించి మా కుటుంబ సభ్యులను ఎవరూ కలవలేదు. మా నుంచి ఎలాంటి అనుమతులను మద్దతును పొందలేదు. 
 
మాకు చెప్పకుండా మా నాన్నగారి జీవితచరిత్రను ఎలా తీస్తారు? మా మనోభావాల మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను. మా నాన్నగారి బయోపిక్‌ను ఎవరు చేయాలన్నా వాళ్లు మా అనుమతిని పొందవలసిందే. స్క్రిప్ట్ చూపించవలసిందే అని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments