Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగువారంతా గర్వపడేలా భార‌తీయ‌న్స్‌ తీశాం : డైరెక్టర్ దీన్ రాజ్

Webdunia
శనివారం, 8 జులై 2023 (18:37 IST)
Bharatheeyans
"ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, క‌లిసుందాం రా" వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గాను, ప్ర‌భాస్ పరిచయ చిత్రం "ఈశ్వ‌ర్‌"కి స్టోరీ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా... "స‌ర్దుకుపోదాం రండి" సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, "లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రానికి వైవిఎస్ చౌద‌రితో కో-రైట‌ర్‌గా ప‌నిచేసి మొద‌టిసారిగా "భార‌తీయ‌న్స్" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ రచయిత దీన‌రాజ్‌. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ చిత్రం ఈనెల 14న తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని పలు ఆసక్తి విషయాలు తెలిపారు.
 
Deen Raj, Dr. Shankar Naidu
ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల గురించి ద‌ర్శ‌కుడు దీన‌రాజ్ మాట్లాడుతూ... "చైనా బోర్డ‌ర్‌లో ఎన్నో వ్యయ‌ప్ర‌యాస‌ల‌కోర్చి షూటింగ్ చేసుకున్న తెలుగు చిత్రం "భార‌తీయ‌న్స్". డ్రోన్స్‌తో షూట్ చేయ‌డానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడ‌వుల్లో షూటింగ్‌కు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమతులు తీసుకున్నాం. వ‌ర్షాలు కురిసి, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయ‌లేక‌పోయేవాళ్ళం. చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ స‌రిప‌డ‌క‌పోవ‌డంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి. కొండ‌చ‌రియ‌లతోపాటు.. చెట్లు విరిగి మా కార్ల‌మీద ప‌డ‌డంతో కొందరు యూనిట్ సభ్యులు బ‌తుకు జీవుడా అని దొరికిన వాహ‌నాన్ని ప‌ట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చేశారు. షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక లోక‌ల్ కారు డ్రైవ‌ర్ తాగి గొడ‌వ చేస్తుంటే, హైద‌రాబాద్ మేనేజ‌ర్ అత‌న్ని కొట్టాడు. దాంతో లోక‌ల్ రౌడీషీట‌ర్ ఎంట‌రై షూటింగ్ ఆపేస్తాన‌ని ఆవేశంతో రెచ్చిపోయాడు. ఆ రౌడీషీట‌ర్‌ని సముదాయించి, సినిమాలో చిన్న వేషం ఇచ్చి ఆ స‌మ‌స్య‌ను ఎలాగో ప‌రిష్క‌రించాం. 
 
అడ‌వుల్లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు జ‌ల‌గ‌లు మా కాళ్ల‌ని ప‌ట్టుకుని సైలెంట్‌గా ర‌క్తాన్ని పీల్చేవి. స‌మీప గ్రామాల నుంచి ఉప్పు బ‌స్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్ల‌లో ఉప్పు వేసుకుని షూటింగ్ కొన‌సాగించాం. సిక్కిం, సిలిగురి అడ‌వుల్లో దోమ‌ల్లాంటి కీట‌కాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌గా వాలి ర‌క్తాన్ని పీల్చేవి. యాక్ష‌న్ అని డైరెక్ట‌ర్ అన‌గానే ఆర్టిస్టులు చేతుల‌తో ఆ కీట‌కాల‌ను తోలుకుంటూ వుండేవారు!!
 
క్లైమాక్స్ కోసం కొండ‌ల మ‌ధ్య‌లో ఉన్న ఒక లోయ‌ను ఎన్నుకున్నాం. ప్ర‌తిరోజూ వేకువ‌జామున 3.30కే బ‌య‌ల్దేరి మూడు గంట‌ల‌పాటు కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణం చేసి ఆ లోయ‌ను చేరుకునేవాళ్ళం. నాకు అస‌లే హైట్స్ ఫోబియా. నాతో పాటు కారులో వున్న వారు, లోయ‌లో ప‌డిపోయిన వెహిక‌ల్స్ గురించి మాట్లాడుకునే వారు. నాయ‌కుడు త‌న పిరికిత‌నాన్ని బ‌య‌ట‌కు చూపించ‌కూడ‌దు. కనుక రోజూ మూడు గంట‌లు పోవ‌డానికి, మూడు గంట‌లు రావ‌డానికి, వూపిరి బిగ‌ప‌ట్టుకుని ప్ర‌యాణం చేసేవాడిని. ఎన్ని క‌ష్టాలు ప‌డితే ఏంటి?  తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుద‌ల కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, "కశ్మీర్ ఫైల్స్" దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి "భార తీయన్స్" చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది. అలాగే... ఇప్పటివరకు మేము వేసిన "ప్రీమియర్ షోస్" అన్నిటికీ అసాధారణ స్పందన వచ్చింది. నూటికి నూరు శాతం మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా మాజీ సైనికులు "భారతీయన్స్" చిత్రం చూసి ఎంతో భావోద్వేగాలకు లోనై మమ్మల్ని అభినందించడం మేము ఎప్పటికీ మర్చిపోలేం" అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments