ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైకాపా సర్కారుపై ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కారు గాడి తప్పిందంటూ ఘాటు విమర్శలు చేశారు. రోజుకో ఘోరం.. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు.
ఈ వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగలేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయమంటూ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీకి అనుబంధంగా మారిందని బాబు ఆరోపించారు.