Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై పంచాయతీలన్నీ యూపీఐ వినియోగ గ్రామాలు

Advertiesment
upi transaction
, శుక్రవారం, 30 జూన్ 2023 (09:42 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం.. తాజాగా దేశంలోని అన్ని పంచాయతీలు ఇకపై తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు, పన్నుల వసూళ్లకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఉపయోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీ తర్వాత అన్ని పంచాయతీలను యూపీఐ వినియోగ గ్రామాలుగా ప్రకటిస్తామని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా నిర్వహంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచన చేసింది. 
 
దీనిపై కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ, పంచాయతీల ప్రతినిధులు ఈ నెల 30వ తేదీ నుంచి సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమవ్వాలి. జూలై 15 నాటికి గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం, భారత్ పే, భీమ్, మొబిక్విక్, వాట్సాప్‌లలో వాటికి అనువైన వాటిని ఎంపిక చేసుకుని 30వ తేదీలోగా ఒకదానిని ఖరారు చేయాలి. డిజిటల్ చెల్లింపులపై జిల్లా, బ్లాకు స్థాయిల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తాం" అని తెలిపారు. 
 
టీనేజీ అమ్మాయిపై వృద్ధుడి అత్యాచారం... 
 
ఢిల్లీలో ఓ టీనేజీ అమ్మాయిపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ బాధితురాలు పొరుగింటి యువతే. గత కొంతకాలంగా ఆ యువతిపై కన్నేసిన 68 యేళ్ల వృద్ధుడు... ఆ యువతిని మాయమాటలతో మభ్యపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, తన ఇంట్లోనే కొడుకు అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. వీడియోను బాధిత బాలిక తండ్రికి కుమారుడు పంపాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 68 యేళ్ల వృద్ధుడు, బాధిత బాలిక పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వృద్ధుడు తరచుగా బాలిక ఇంటికి వచ్చేవాడు. ఇరు కుటుంబాలు కలిసి అపుడపుడూ ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతుండేవాడు. ఒక రోజు తన ఇంటి వెలుపలు ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించిన వృద్ధుడు ఆమెను మభ్యపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
అయితే, ఈ అత్యాచార ఘటన ఓ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయింది. ఈ కెమెరాను నిందితుడి కుమారుడే అమర్చాడు. వృద్ధుడికి 40 యేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తండ్రి తీరు నచ్చకపోవడంతో ఇరువురి మధ్య మాటల్లేవు. తమపై క్షుద్రపూజలు చేస్తున్నాడేమోనని అనుమానించిన ఆ కుమారుడు.. తండ్రికి చెందిన గదిలో రహస్యంగా కెమెరా అమర్చాడు. 
 
ఇపుడా కెమెరాలోనే రేప్ ఘటన నమోదైంది. అయితే, మఈ రేప్ వీడియో బాధిత బాలిక తండ్రికి చేరడంతో కుమార్తెనులదీశాడు. దీంతో ఆ బాలిక జరిగిందంతా వివరించింది. వృద్ధుడు చేసిన పాడుపనికి తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. వృద్ధుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ రాష్ట్ర డీజీపీగా పోరుమామిళ్ల వాసి