Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

దేవీ
శనివారం, 17 మే 2025 (16:40 IST)
Director Vijay Kanakamedala
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
 
గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం? ఒరిజినల్ కథకి తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేశారు?
- కథ కమర్షియల్ గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్ లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో వుంటుంది. క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ నా స్టైల్ లో ఉంటుంది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఒరిజినల్ చూసిన వరకు కూడా డెఫినెట్  గా కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. ఒరిజినల్ కంటే ఇది బావుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు.
 
ముగ్గురు హీరోలతో సెట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?  చాలెంజింగ్ మూమెంట్ ఏమిటి?
-బిగినింగ్ లో ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమవుతుందేమో అనుకున్నాను.  అయితే ఈ ముగ్గురు కూడా ఆఫ్ స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. 14 రోజులు పాటు ఫుల్ నైట్స్ వర్క్ చేసాం. దాదాపు 900 మంది సెట్స్ లో ఉండేవారు. అ అపోర్షన్ షూట్ చేయడం చాలెంజింగ్ గా అనిపించింది.
 
-నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం జాయ్ ఫుల్ గా ఉంటుంది. ఇది  ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్య జరుగుతున్న డ్రామా. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలో అంతే పెట్టాం. ముగ్గురి క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి. మనోజ్ గారు సెట్స్ లో వుంటే చాలా జాయ్ ఫుల్ గా ఉంటుంది.
 
మీకు చాలెంజింగ్ అనిపించే జానెర్ ఏది?
-డ్రామా, యాక్షన్ థ్రిల్లర్స్ హారర్.. ఇవన్నీ ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ మాత్రం చాలా కష్టం.
 
ఈ సినిమాకి భైరవ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
-కథ నుంచి వచ్చిన టైటిల్ ఇది. సినిమాలో చిన్న డివోషనల్ టచింగ్ ఉంటుంది. ఒక గ్రామంలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు  భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి భైరవం అని టైటిల్ పెట్టాం.
 
ఇందులో కనిపించిన టెంపుల్ రియల్ లోకేషనా?
-ముందుగా మేము మైసూర్ లో రియల్ లొకేషన్ లో సూట్ చేయాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేయడం వల్ల అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ వేసి సూట్ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది.
 
నెక్స్ట్ సినిమా ఏంటి?
-కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏమీ అనుకోలేదు, భైరవం ఇచ్చే సక్సెస్ బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది.
 
ఎలాంటి కథలు సిద్ధం చేసుకున్నారు?  
-చిరంజీవి గారి కోసం ఒక కథని సిద్ధం చేసుకున్నా. అలాగే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి కోసం కూడా ఒక కథను సిద్ధం చేశాం. చిరంజీవి గారిని ఈ సినిమా గ్యాప్ లో ఒకసారి కలవడం జరిగింది. ఆయన టైం ఇస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments