మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (15:43 IST)
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. "పుష్ప-2" వంటి మాస్ యాక్షన్‌ మూవీ తర్వాత అదే జానర్‌లో వస్తుందని భావించారు. అయితే, ఈ ప్రాజెక్టుపై తాజాగా నిర్మాత నాగవంశీ ఓ కీలకమైన విషయాన్ని వెల్లడించారు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్ని ఓ మూవీ చేయనున్న విషయం తెల్సిందే. ఇది పూర్తిగా మైథలాజికల్ జానర్ అని నాగవంశీ తెలిపారు. సోషియో ఫాంటసీ చిత్రం మాత్రం కాదన్నారు. పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయన్నారు. అక్టోబరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 
 
ఇక ఈ సినిమాలో బన్ని.. కుమారస్వామిగా కనిపిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇపుడు నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో బన్ని లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎక్స్‌లోనూ ఈ హీరో కుమార్ స్వామిగా ఉన్న జిబ్లీ ఇమేజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

భర్తను వదిలేసిన ఆమె.. భార్యను వదిలేసిన ఆయన.. కర్నూలులో ప్రేమికుల ఆత్మహత్య

డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోతకు అదిరేది లేదు భయపడేది లేదు : చైనా

పాఠశాలల్లో ఫీజులను యూపీఐ ద్వారా వసూలు చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments