Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

Advertiesment
Naga vamsi

దేవీ

, మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (14:45 IST)
Naga vamsi
సినిమాలపై రివ్యూ రాయడం అనేది వ్యక్తిగతం. దాన్ని దేశంలోవారి ఐడియాగా చెప్పడం అనైతికం అంటూ మ్యాడ్ స్క్వేర్ నిర్మాత నాగవంశీ అన్నారు. విడుదలైన రోజు నుంచి నేటివరకు కలెక్లన్లపరంగా పెరుగుతూ సక్సెస్ రేంజ్ కు వెళితే కొంతమంది ప్రత్యేకించి నెగెటివ్ గా వెబ్ సైట్లలో రాయడం దారుణమని అన్నారు. మేం ఇంటర్వ్యూలు ఇస్తే మీ వెబ్ సైట్లు, యూ ట్యూబ్ లు నడుస్తున్నాయి. మా మీద బతికే మీరు చంపే ప్రయత్నం చేస్తున్నారు.

మీరు రివ్యూలు రాయపోతే సినిమా ఆడదా? ఓవర్ సీస్ లో కూడా సినిమా రివ్యూల వల్ల సినిమా సక్సెస్ అయిందనుకోవడం పొరపాటే. సినిమా బాగుంటే సక్సెస్ అవుతుంది. మీ రాతలవల్ల కాదు అంటూ ఘాటుగా విమర్శించారు.
 
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మ్యాడ్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయారు. కథ ప్రకారం నలుగురు వ్యక్తులు అలానే ప్రవర్తించాలి. కొందరు ఫస్టాఫ్ బాగుందనీ, సెకండాఫ్ బాగోలేదని రాశారు. మ్యాడ్ సినిమా కంటే సీక్వెల్ బాగోలేదని కొందరు రాశారు. అసలు ప్రేక్షకులు మాత్రం మ్యాడ్ సీక్వెల్ చాలా బాగుందని తీర్పు ఇచ్చారు. రివ్యూలు రాసేవారు ఇంటిలో ఏదో ప్రాబ్లమ్ తో సినిమా చూస్తే అది రివ్యూపై పడుతుందని ఎద్దేవా చేశారు. మా సినిమాతోపాటు మోహన్ లాల్, విక్రమ్, నితిన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమా ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. కానీ మా సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజే 17 కోట్ల గ్రాస్ తెచ్చుకుందని నిర్మాత తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్