Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mad Gang: నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ గ్యాంగ్

Advertiesment
Sangeet Shobhan, Ram Nithin, Narne Nithin

దేవీ

, సోమవారం, 24 మార్చి 2025 (15:37 IST)
Sangeet Shobhan, Ram Nithin, Narne Nithin
మ్యాడ్ సినిమా చేశాక ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేం ఎవరో కూడా వారికి తెలీదు? ఆదరిస్తారోలేదో? అనే గందరగోళంగా వున్నాం. విడుదలయ్యాక మాకే ఆశ్చర్యంకలిగించే సక్సెస్ ఇచ్చారు. ఆ స్పూర్తితో సీక్వెల్ చేశాం. ఇలాంటి ఫ్రాంఛైజ్ గా చేయవచ్చు. కానీ ప్రస్తుతానికి మ్యాడ్ స్క్వేర్ తో చాలు అనుకుంటున్నామని మ్యాడ్ బ్యాచ్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ అన్నారు.
 
ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. మార్చి 28న విడుదల కానున్న 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నేడుసినిమా గురించి మ్యాడ్ గ్యాంగ్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
 
మీ ముగ్గురి కాంబినేషన్ బాగుంది. ఇతర సినిమాల్లో కూడా కలిసి నటిస్తారా?
రామ్ నితిన్: మ్యాడ్ అనేది మాకు ఎంతో స్పెషల్ మూవీ. మ్యాడ్ వరకే ఆ ప్రత్యేకత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
సంగీత్ శోభన్: ఇప్పటిదాకా అయితే దాని గురించి ఆలోచించలేదు.
 
ఈ చిత్రానికి మెయిన్ హీరో ఎవరంటే ఏం చెప్తారు?
వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. ఆ వినోదమే మ్యాడ్ స్క్వేర్ ని నడిపిస్తుంది.
 
మ్యాడ్ స్క్వేర్ తో ఎంత మ్యాడ్ క్రియేట్ చేయబోతున్నారు?
రామ్ నితిన్: మ్యాడ్ తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈసారి అశోక్(నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి. ప్రేక్షకులు ఈ కామెడీని బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నాము.
 
మ్యాడ్ స్క్వేర్ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
రామ్ నితిన్: మ్యాడ్ నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం కాస్త ఉండేది. మ్యాడ్ స్క్వేర్ కి ఎలాంటి భయం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చేశాము. దాంతో పర్ఫామెన్స్ ఇంకా బెటర్ గా వచ్చింది.
నార్నె నితిన్: మ్యాడ్ లో ప్రతి పాత్రకు ఒక ట్రాక్ ఉంటుంది. నా పాత్ర మొదట కాస్త సీరియస్ గా ఉంటుంది. చివరికి వచ్చేసరికి మిగతా పాత్రల్లాగా కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను.
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మ్యాడ్ స్క్వేర్ ను ఆడుతూపాడుతూ చేశాము. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు.
 
సీక్వెల్ చేద్దామని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
రామ్ నితిన్: చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యాడ్ షూటింగ్ పూర్తవుతున్న సమయంలో మంచి టీంని మిస్ అవుతున్నాను అనే బాధ ఉండేది. కానీ, సినిమా విడుదలై పెద్ద హిట్ అవ్వడం, వెంటనే సీక్వెల్ అనడంతో.. చాలా ఆనందించాము. 
 
నిర్మాత నాగవంశీ గారు ఈ సినిమాలో కథ లేదు అన్నారు కదా?
నార్నె నితిన్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల నుంచి కథ ఆశించాలి. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి అనే ఉద్దేశంతో నాగవంశీ గారు చెప్పారు.
సంగీత్ శోభన్: ఒక సినిమా మనం ఏ ఉద్దేశంతో చేశామనేది ముందే ప్రేక్షకులకు తెలిసేలా చేస్తే మంచిది. ఇది నవ్వించడానికి తీసిన సినిమా కాబట్టి, ఆ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలనే ఉద్దేశంతో అలా చెప్పాము.
 
మ్యాడ్ విషయంలో నాగవంశీ గారి పాత్ర ఎంత ఉంది?
రామ్ నితిన్: నాగవంశీ గారి పాత్రే కీలకం. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. నన్ను కేవలం ఒక వెబ్ సిరీస్ లో చూసి, మనోజ్ పాత్రకు సరిపోతానని సూచించారంటే.. నాగవంశీ గారు సినిమా గురించి ఎంత ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన దర్శకుడిని, నటీనటులను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు.
 
సినిమాలో హీరోయిన్ పాత్రలు ఉంటాయా?
నార్నె నితిన్: మొదటి భాగానికి కొనసాగింపుగా వారి పాత్రలు మా జీవితాల్లో ఉంటాయి. కానీ, వారు తెర మీద కనిపించరు.
 
మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయానికి కారణం వినోదం. అదే మా బలం. దానిని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోద భరిత చిత్రంగా మ్యాడ్ స్క్వేర్ ను మలచడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామెడీ పూర్తిగా కొత్తగా ఉంటుంది.
 
కుటుంబ ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుందా?
సంగీత్ శోభన్: మొదటి పార్ట్ సమయంలో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను కూడా క్లీన్ కామెడీ ఫిల్మ్ గానే రూపొందించాము. వంశీ గారు చెప్పినట్టు ముఖ్యంగా పెళ్లి సీక్వెన్స్ అందరికీ నచ్చుతుంది.
 
లడ్డు పాత్ర ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ లో కంటే మ్యాడ్ స్క్వేర్ లో లడ్డు పాత్ర మరింత కామెడీగా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి లడ్డుని ఫుల్ గా ఆడుకుంటాము.
 
నార్నె నితిన్ గారు మీ బావగారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సలహాలు ఇస్తారా?
నార్నె నితిన్: నా మొదటి సినిమా నుంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకుంటున్నాను. భవిష్యత్ లో కూడా ఆయన సలహాలు తీసుకుంటాను.
 
మ్యాడ్ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
చేస్తే బాగుంటుంది. కానీ, వెంటనే కాకుండా కాస్త విరామం ఇచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)