బాలీవుడ్‌లో "సైరా" హవా... పత్తాలేని 'వార్'

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:38 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారత్‌లో మాత్రం పాన్ ఇండియా మూవీగా వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. అయితే, ఈ చిత్రం దక్షిణాదిలో తిరుగులేకుండా పోయింది. ఇక బాలీవుడ్‌లో సైతం 'సైరా' తన హవాను కొనసాగిస్తోంది. 
 
నిజానికి బాలీవుడ్‌లో సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని వాయిదా వేయనున్నారనే ప్రచారం సాగింది. దీనికి ప్రధాన కారణం... వార్ చిత్రమే. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోలు నటించిన వార్ మూవీ కూడా అక్టోబరు రెండో తేదీనే విడుదలైంది. దీంతో చిరంజీవి నటించిన సైరా మూవీని ఒక వారం రోజుల పాటు వాయిదా వేయనున్నారన్న ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలను తోసిపుచ్చిన నిర్మాత రామ్ చరణ్ యధావిధిగానే అనుకున్న తేదీనే చిత్రాన్ని విడుదల చేశారు. 
 
దీంతో బాలీవుడ్‌లో వార్ వర్సెస్ సైరాగా మారింది. కానీ, ఈ రెండు చిత్రాల్లో విభిన్నమైన టాక్‌ను సొంతం చేసుకున్నాయి. వార్ మూవి నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకోగా, సైరా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్‌లో చిరంజీవి సైరా అంటూ సత్తా చాటాడని అంటున్నారు. నిజానికి బాలీవుడ్‌లో సైరా కంటే వార్ మూవీపైనే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, నెగెటివ్ టాక్‌తో సైరా కంటే వార్ మూవీ వెనుకబడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments