Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రకు హేమంత్ కన్యత్వ పరీక్షలు.. ఆమె మరణానికి భర్తే కారణం.. ఎవరు? (video)

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (18:41 IST)
తమిళ్ టీవీనటి చిత్ర ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రను ఆమె భర్త హేమంత్ హింసించాడని ఆమెను అనుమానించి కన్యత్వ పరీక్షలు కూడా చేయించేందుకు చూశాడనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాకుండా.. హేమంత్‌కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. చిత్ర-హేమంత్ కామన్ ఫ్రెండ్ బయట పెట్టినట్టు చెబుతున్న ఈ విషయాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. దీంతో.. పోలీసులు ఆ దిశగా కేసును విచారిస్తున్నారు.
 
చెన్నైలోని నాసరపేటలోని ఓ స్టార్ హోటల్‌లో గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన చిత్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే.. ఆ సమయంలో వ్యాపారవేత్త అయిన ఆమె భర్త అదే హోటల్‌లో ఉన్నాడని తేలడం.. చిత్ర ఒంటిపై పలు చోట్ల గాయాలు కనిపించడంతో పోలీసులు ఆమె భర్త హేమంత్‌ను అరెస్టు చేశారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర ఆమె భర్త హేమంత్ కామన్ ఫ్రెండ్ రోహిత్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాలు బయటపెట్టినట్టు సమాచారం. చిత్ర మరణానికి ఆమె భర్తే కారణమని రోహిత్ పరోక్షంగా వెల్లడించినట్టు ప్రచారం సాగుతోంది. 'పాండియన్ స్టోర్స్' సీరియల్‌ నటించిన చిత్ర.. చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ఈ సీరియల్‌లో చిత్రతో కలిసి నటించిన కుమార్ అనే నటుడిపై హేమంత్ దాడిచేశాడని రోహిత్ వెల్లడించాడట. చిత్రతో ఇకపై నటించొద్దని చితకబాదేశాడని రోహిత్ సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. చిత్ర మృతి కేసును ఆ దిశగా విచారిస్తున్నట్టు సమాచారం.
 
చిత్ర క్యారెక్టర్ మీద ఆమె భర్త హేమంత్‌కు అనేక అనుమనాలు ఉన్నాయని అందుకే.. ఆమెకు కన్యత్వ పరీక్షలు చేయించడానికి కూడా సిద్ధమయ్యాడని రోహిత్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. భార్యాభర్తలు నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో ఓ డాక్టర్ ఉన్నారని తన భార్యకు కన్యత్వ పరీక్ష చేయాలని ఆ డాక్టర్ మీద హేమంత్ ఒత్తిడి తెచ్చాడని రోహిత్ బాంబు పేల్చినట్టు తెలుస్తోంది.
 
చిత్రకు కన్యత్వ పరీక్ష చేయాలని హేమంత్ పట్టుబట్టిన విషయాన్ని సదరు డాక్టర్ చిత్రకు చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న చిత్ర.. రోహిత్ ఇతర సన్నిహితుల వద్ద కుమిలిపోయిందట. హేమంత్‌‌కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆ విషయాలు తెలిసినా తాను అతన్ని పెళ్లి చేసుకున్నానని చిత్ర ఆవేదన వ్యక్తంచేసిందని ప్రచారం సాగుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపేసారు.. ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య

దివ్యాంగురాలిపై మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన మామ...

నీతో ఒంటరిగా మాట్లాడాలని ఇంటికి పిలిచాడు.. స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన ప్రియుడు..

కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు నెయ్యి సరఫరాదారుల అరెస్టు (Video)

డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments