Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీజే చిత్ర ఆత్మహత్య.. ఆ గదిలో అన్ని కండోమ్‌లు ఎందుకు..?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:17 IST)
బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య తమిళనాట పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రకు అత్యంత ఆప్తురాలైన ఆమె స్నేహితురాలు రేఖా నాయర్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. హేమంత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చిత్ర ఆత్మహత్యకు పాల్పడటానికి కారకులని రేఖా నాయర్ ఆరోపించింది. 
 
అయితే.. ఆమె చేసిన ఈ ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం గమనార్హం. రేఖా నాయర్‌ చెప్పిన కొన్ని విషయాలు విస్తుపోయేలా చేశాయి. చిత్ర, ఆమె భర్త హేమంత్ కలిసి ఉన్న గదిలో చాలా కండోమ్స్ ఉన్నాయని, భార్యాభర్తలు మాత్రమే ఉన్న ఆ గదిలో అన్ని కండోమ్స్ ఎందుకు ఉన్నాయని రేఖా నాయర్ ప్రశ్నించింది.
 
అయితే హేమంత్ మాత్రం తన భార్య ప్రాణం పోవడానికి కారణమైనవాళ్లు కూడా చచ్చిపోవాలని ఇటీవల కూడా వ్యాఖ్యానించాడు. మరోవైపు వీజే చిత్ర ఆత్మహత్యకు పాల్పడిన 17 నెలల తర్వాత ఆమె ఆత్మహత్య కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తమ కూతురి మృతిపై నిజానిజాలను నిగ్గు తేల్చేలా మరోసారి దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
 
డిసెంబర్ 9,2020న హోటల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో వీజే చిత్ర కనిపించింది. ఆమె ఆత్మహత్య కేసులో చిత్ర భర్త హేమంత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 15న బెయిల్‌పై హేమంత్ విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments