Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గగనతలంలో విమానం కుదుపులు.. 17 మందికి గాయాలు

Advertiesment
spicejet flight
, సోమవారం, 2 మే 2022 (10:51 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో ఈ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమాన ప్రయాణికుల్లో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ముంబై నుంచి వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ బి737లో జరిగింది. 
 
ఈ విమానం దుర్గాపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ముందు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు కూడా తెరుచుకుని, అందులోని లగేజి ప్రయాణికులపై పడింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ హఠాత్‌పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఫోర్త్ వేవ్‌పై భయాలు అక్కర్లేదు.. ఐసీఎంఆర్