Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (14:35 IST)
సినిమాలు ఇక వద్దు అని చిత్రపరిశ్రమను వీడి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూర్ నటులు అంటారని హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక అన్నారు. కానీ, తన భర్త 17 యేళ్లుగా చిత్రపరిశ్రమను నమ్ముకుని ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. 
 
వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'నింద'. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూన్‌ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక భావేద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత వరుణ్‌ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. 'నింద' ప్రమోషన్స్‌లో ఆయన్ని చాలామంది తన కెరీర్‌ ఫెయిల్యూర్‌పై ప్రశ్నలు అడుగుతున్నారు. 'మీకు అవకాశాలు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్‌ యాక్టర్‌ కదా' ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 
నిజం చెప్పాలంటే వరుణ్‌ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు. వరుణ్‌ అలా చేయలేదు. ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. 'నింద' మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని వితిక ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments