ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన నిందితుడికి విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వాదనలు ఆలకించిన తర్వాత తీర్పును మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి నేడు తీర్పును వెలువరించారు. నిందితుడు సతీశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని సతీశ్‌కు కోర్టు షరతు విధించింది. ప్రస్తుతం సతీశ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత సతీశ్‌ను అధికారులు జైలు నుంచి విడుదల చేయనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారం చేస్తుండగా, గత నెల 13వ తేదీన సీఎం జగన్‌పై విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గులకరాయి దాడి జరిగిన విషయం తెల్సిందే.
కలిసి మద్యం సేవించలేదని భవనంపై నుంచి ఎత్తిపడేశాడు..
తనతో కలిసి మద్యం సేవించేందుకు స్నేహితుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన మరో స్నేహితుడు అతన్ని మేడపై నుంచి ఎత్తి కిందపడేశాడు. ఆ తర్వాత మరికొందరు స్నేహితులు కిందపడిన బాధితుడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా అనే ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ ఘటన మొత్తం బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోలో ఇద్దరు యువకులు డాబాపై పెనుగులాడుతుండగా మరో యువకుడు పక్క నుంచి డాబా ఎక్కుతుండటం కనిపించింది. ఆ ర్వాత పిట్టగోడను గట్టిగా పట్టుకుని రంజిత్‌న మరో యువకుడు అమాంతం పైకెత్తి కిందపడేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. కిందపడిన రంజిత్ బాధతో విలవిల్లాడుతుంటే కింద నిలబడిన మరో ఇద్దరు స్నేహితులు అత్ని కాళ్లతో తన్నగా మరో ఇద్దరు యువకులు చోద్యం చూశారు. ఆ సమయంలో పైనుంచి మరో యువకుడు కిందకు దిగాడు. చివరకు ఓ యువకుడు దాడిని ఆపడంతో వీడియో ముగిసింది.
రంజిత్‌ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఒకే అంతస్తులో ఇంటి పైనుంచి కిందపడటంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స తర్వాత అతన్ని వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.