Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్ భార్య రితిక

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (10:08 IST)
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు వరుణ్ సందేశ్‌. ప్రస్తుతం అతడికి అవకాశాలు రాక వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. 
 
హీరో వరుణ్ భార్య వితికా షేరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ జంట ఆ మధ్య బిగ్‌బాస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం బారిన పడినట్లు వెల్లడించింది.  తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్, మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. 
 
దీంతో, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 
మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి కలుగుతున్నాయని, ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టు తెలిపింది. నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. 
 
తన బాధను అభిమానులతో పంచుకుంటూ కాస్త రిలీఫ్ పొందుతున్నానని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొట్టుకున్న కోడళ్లు... ఆపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అత్త

Influencer: టర్కీలో పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకున్న మహిళా ఇన్ఫ్లుయెన్సర్ (video)

నాకు దక్కనిది మరెవరికీ దక్కదు : ప్రియురాలి గొంతుకోసి హత్య

చీరకట్టులో ఉన్న అందమే వేరు.. కానీ చీరలో అర్ధనగ్నంగా కనిపించి పరువు తీసింది.. (video)

ఢిల్లీలో ఉండబుద్ధి కావడం లేదు : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments