Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరగాయ పచ్చళ్లు ఎవరికి మేలు చేస్తాయి?

Advertiesment
pickle
, గురువారం, 19 అక్టోబరు 2023 (23:34 IST)
ఊరగాయ పచ్చళ్లు. ఇవి లేకుండా భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.పచ్చళ్లు జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ వుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఊరగాయ పచ్చళ్లు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఊరగాయ పచ్చళ్లు కాలేయానికి మేలు చేస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.

పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. గమనిక: ఊరగాయ పచ్చళ్లు బీపీ పేషెంట్లకు మంచివి కాదు, చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యవంతమైన బాదం ఆధారిత వంటకాలను తయారుచేయడం ద్వారా నవరాత్రి వేడుక జరుపుకోండి