బీరకాయ. కూరగాయల్లో వేటికవే ప్రత్యేక ప్రయోజనాలను కలిగి వుంటాయి. బీరకాయను తింటుంటే మతిమరుపు సమస్య తగ్గుముఖం పడుతుంది. బీరకాయతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తహీనత తగ్గి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు బీరకాయ తీసుకోవాలి. బీరకాయ తింటుంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. బీరకాయ తినేవారిలో కంటిచూపు మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి బీరకాయ మేలు చేస్తుంది. మలబద్ధకం నుండి బీరకాయ ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ పనితీరును బీరకాయ రక్షిస్తుంది. బీరకాయ తింటుంటే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. శరీర వేడిని తగ్గించి శరీరం కాంతివంతంగా వుండేదుకు సాయపడుతుంది.