Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ లైలా

డీవీ
శనివారం, 30 మార్చి 2024 (10:33 IST)
Laila poster
విశ్వక్ సేన్ తన12వ సినిమా  దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేస్తున్నారు..షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ గత ప్రొడక్షన్ వెంచర్ భగవంత్ కేసరి మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను దర్శకుడు  సిద్ధం చేశారు.
 
విశ్వక్ సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'లైలా' అనే టైటిల్ పెట్టారు.  టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్ గా ఉంది.
 
పోస్టర్ ప్లజెంట్, వైలెంట్ వస్తువులతో బ్యాలెన్స్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి, మేక తల మొదలైనవి ఉన్నాయి. టైటిల్ పోస్టర్ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యురియాసిటీ కలిగిస్తుంది. మోషన్ పోస్టర్‌లో పోస్టర్‌లో చూపిన అన్ని ఎలిమెంట్స్‌ను విడివిడిగా చూపించారు. యానిమేషన్ పార్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. .
 
టైటిల్, మోషన్ పోస్టర్ సినిమాలో కథానాయికకు కూడా స్కోప్ ఉందని సూచిస్తున్నాయి. ఆమె పేరు తర్వాత తెలియజేయనున్నారు. అద్భుతమైన టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
రిచర్డ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments