Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టినప్పుడు ఆడ, పెద్దయ్యాక మగ, తెలుగు తెరపై గామీ సరికొత్త ప్రయోగం సినిమా రివ్యూ

Advertiesment
gaami movie

డీవీ

, శుక్రవారం, 8 మార్చి 2024 (11:48 IST)
విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమా శుక్రవారం విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. 
 
కథ:
కథగా చెప్పాలంటే భిన్నమైన కాన్సెప్ట్. శివ (విశ్వక్ సేన్) జనటికల్ డిజార్డర్‌తో బాధపడుతుంటారు. ఎవరైనా టచ్ చేస్తే బాడీ ఓవర్ హీట్‌తో నరాలు బయటకు వచ్చి శక్తి కోల్పోతాడు. అలాంటి వాడు ఉత్తరాదిలో అఘోర ఆశ్రమంలో ఉంటాడు. అతని వల్ల మిగిలిన వారు ప్రాబ్లెమ్ ఫేస్ చేయడంతో. అఘోర పెద్ద 15 ఏళ్ల నాడు నిన్ను తెచ్చిన బాబా వద్దకు వేలితో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెపుతాడు. అలా బాబా అడ్రెస్స్ పట్టుకుని హిమాలయ దగ్గర బాబకోసం వెళితే తను కాలం చేశారని శిష్యుడు చెపుతాడు. అప్పటికే అక్కడకు మరో పనిమీద వచ్చిన జాహ్నవి (చాందినీ చౌదరి) తీసుకుని నీ సమస్యకు పరిష్కారం దొరికే ప్లేస్‌కు వెళ్ళమని చెపుతాడు. ఆ తర్వాత జర్నీ మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ సినిమా ఇంటలెక్టువల్ మూవీ. హాలీవుడ్ మూవీస్ తరహాలో సరి కొత్త కథతో దర్శకుడు తీశాడు. హీరో పాత్రకు, సమస్యకు.. లింక్ చేస్తూ నెల్లూరు దగ్గర గ్రామంలో దేవదాసి, హిమాలయాల్లో మనిషి మెదడుపై ప్రయోగాలు చేసే లాబ్. ఎలా 3 కథలు రన్ చేస్తూ, వారికి లింక్ ఉందని సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కానీ ముగింపు చూస్తే థ్రిల్ అవుతారు.
సైంటిఫిక్ డిజార్డర్ కాన్సెప్ట్‌తో. ఇలా తెలుగులో రావడం గొప్ప ప్రయోగం. టేకింగ్, టెంపో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితం హైలెట్. 
 
హిమాలయాల్లో కుక్కల దాడి, సింహం దాడి, ట్రెక్కింగ్ అంశాలు హాలీవుడ్ సినిమా ఫీలింగ్ కనిపిస్తుంది. ఇలా సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ  కామన్‌మేన్‌కు అర్థం కానీ సినిమా.. 
1. ఇక మనిషి మెదడులో ప్రయోగాలు ఎందుకు చేస్తారో క్లారిటీ లేదు.
2. హీరో జనటిక్ సమస్య పుట్టినప్పుడే ఆడ మనిషి. రాను రాను పురుషుడు గా మారే సరికొత్త కాన్సెప్ట్ ఈ సినిమాలో చెప్పాడు.
3. అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్.. 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియమణిని వరిస్తున్న వరుస బాలీవుడ్‌ ఆఫర్లు