Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూతల స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్న విష్ణు విశాల్ - జ్వాలా గుత్తా

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:17 IST)
ప్రేమ జంటలకు, నవదంపతులకు టూరిస్ట్ స్పాట్‌గా మాల్దీవులు మారిపోయింది. భూతలస్వర్గంగా పేరొందిన మాల్దీవులకు అనేక మంది సెలెబ్రిటీలు విహార యాత్రకు వెళుతున్నారు. 
 
ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత ఎవ‌రైన విహార యాత్ర‌కు వెళ్ళాలి అంటే మాల్దీవుస్‌ని ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌, టాలీవుడ్ భామ‌లు మాల్దీవుల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌గా ఇటీవ‌ల మోహ‌న్ బాబు ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా అక్క‌డికి వెళ్లి అందాల‌ను త‌న‌వితీరా ఆస్వాదించి వ‌చ్చారు. 
 
ఇక ఇప్పుడు కోలీవుడ్ ప్రేమ జంట విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల మాల్దీవుల్లో విహరిస్తున్నారు. మాల్దీవుల్లో బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలాతో క‌లిసి విష్ణు విశాల్ ఎంజాయ్ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 
 
కొద్ది రోజుల క్రితం ఈ జంట త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు నిశ్చితార్ధం కూడా జ‌రుపుకున్నారు. పెళ్లిపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తామంటున్నారు. గుత్తా జ్వాల బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని ప్రారంభించ‌గా, దీనికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను ఆమెనే స్వ‌యంగా చూసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments