వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్న నయనతార! (video)

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:41 IST)
అటు కోలీవుడ్... ఇటు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార. సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతోంది. అయితే, పలువురుతో ప్రేమాయణం కొనసాగించి అంతే హెడ్ లైన్స్‌లో నిలిచింది. 
 
ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీబిజీగా ఉన్న న‌య‌న్ త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార తొలిసారి ప్రభుదేవా ప్రేమ‌లో ప‌డ‌గా, ఆయ‌న‌తో కొన్నాళ్ళు డేటింగ్ చేశాక గుడ్‌బై చెప్పింది. 
 
అనంత‌రం శింబుతో ప్రేమ‌ను కొన‌సాగించింది. వారిద్ద‌రి మ‌ధ్య బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌వ‌లేకుండా పోయింది. ఇక ప్ర‌స్తుతం త‌మిళ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఉన్న న‌య‌న‌తార ఆయ‌నతో చెట్టా ప‌ట్టాలు, ఫెస్టివ‌ల్ సెల‌బ్రేష‌న్స్‌, విందులు, వినోదాలు వంటివి చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది. 
 
వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించి కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నా దీనిపై ఇద్ద‌రు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి నయనతార పెళ్ళిపీటలెక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 
 
పెళ్లి త‌ర్వాత కూడా న‌య‌న‌తార సినిమాలు చేస్తుంద‌ట‌. అలానే భ‌ర్త‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments