Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ ఉగ్రరూపం రత్నం లుక్ - సమ్మర్‌లో సినిమా విడుదల

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (09:38 IST)
Vishal, Ratnam Look
మాస్ యాక్షన్ హీరో విశాల్ రత్నం చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటి వరకు వదిలిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకున్నాయి.
 
తాజాగా విశాల్ తన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. రత్నం సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ పోస్టర్‌లో విశాల్ ఉగ్రరూపాన్ని చూపించారు. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాతను కూడా చూపించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే తెరపై ఊచకోత గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది.
 
సమ్మర్‌లో రత్నం సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments