రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న లాల్ సలామ్ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రజనీ, కపిల్ దేవ్ క్రికెట్ మైదానంలో నడుచుకుంటూ వస్తున్న పిక్ ను విడుదల చేసింది. ఈ సినిమా భారతీయ తమిళ భాషా స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా రూపొందుతోంది. కాగా ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ క్రింద సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.
విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, విఘ్నేష్ , లివింగ్స్టన్ , సెంథిల్ , జీవిత , కెఎస్ రవికుమార్ మరియు తంబి రామయ్యతో సహా సమిష్టి సహాయక తారాగణం.
కుమార్తె దర్శకత్వంలో రజనీ సినిమా కనుక అన్ని కార్యక్రమాలు ముగించుకుని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మిగిలిన సినిమాలు వుండడంతో జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ ముంబైకి చెందిన మాఫియా డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రజనీని 'బాషా' , 'కాలా', 'కబాలి' వంటి అనేక సినిమాల్లో డాన్ రోల్స్ చేశారు. మరి, ఆయనను అమ్మాయి ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.