విశాల్ పాన్ ఇండియా మూవీ లాఠీ గ్లింప్స్ రాబోతుంది

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (06:46 IST)
Vishal
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
 
‘లాఠీ’ మూవీ మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ను నవంబర్ 13వ తేది సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన మేకర్స్ ఈ మేరకు ఆహ్వానం పలికారు. 
 
 తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది.
 
 లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.
 
సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్  రచయితగా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments