Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. ఆ బిల్డింగ్ పూర్తయ్యాకే మ్యారేజ్.. విశాల్

Advertiesment
Vishal new look
, బుధవారం, 9 నవంబరు 2022 (10:45 IST)
నటుడు విశాల్ తన పెళ్లికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి తనకు సెట్ కాదని విశాల్ చెప్పేశాడు. త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తానని తెలిపాడు. 
 
అయితే తన పెళ్ళికి మూడేళ్లు సమయం పడుతుందని విశాల్ వెల్లడించాడు. యాక్టర్స్ యూనియన్ కోసం కడుతున్న బిల్డిండ్ పూర్తయ్యాకే మ్యారేజ్ అంటున్నాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్.
 
ఇక విశాల్ ప్రియురాలు ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది. హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు రావడంతో ఆమెతో విశాల్ పెళ్లి అంటున్నారు. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్‌కు భార్యగా అభినయ నటించింది. గతంలో కూడా ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బికినీ వేసుకున్నా అసభ్యత అనిపించదు : జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్