Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో విడుదల కానున్న విశాల్ `అయోగ్య‌... రిలీజ్ ఎప్పుడు..?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (19:50 IST)
విశాల్ హీరోగా ఇటీవల తమిళనాడులో విడుదలై, మంచి సంచలన అందుకున్న చిత్రం అయోగ్య చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాల్ స‌ర‌స‌న స్టన్నింగ్ బ్యూటీ రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్‌` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 
నిర్మాత ప్ర‌శాంత్ గౌడ్ మాట్లాడుతూ -“ `అయోగ్య` త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. త‌మిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించారు. విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్‌ని ప‌దింత‌లు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమాకే హైలైట్. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌ధార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. 
 
త‌మిళంలో హిట్ట‌యిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి. ఆ కోవ‌లోనే అయోగ్య ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments