Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాటపర్వంకు నెట్ ఫ్లిక్స్ రూ.30కోట్ల ఆఫర్.. రిలీజ్ ఎప్పుడో?

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:21 IST)
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు అదిరిపోయే ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.
 
కంటెంట్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపిస్తారు. ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన ప్రాంతం ఏది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments