Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు డ్యాన్స్ నేర్పుతున్న కేజీఎఫ్ హీరో... వైరల్ అవుతున్న స్పెషల్ వీడియో

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (16:29 IST)
కెజిఎఫ్ సినిమాతో మిగతా సినీ పరిశ్రమలలో కూడా సుపరిచితుడైన హీరో యశ్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే తెలుగులో కూడా అతని క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో మిగిలిన సినిమాలు కూడా ఇక్కడ విడుదల చేయాలని భావిస్తున్నాడు. యశ్.. తన కో స్టార్ రాధిక పండిట్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
 
తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో 'కేజీఎఫ్'లోని పాటకు యశ్.. రాధికకు డ్యాన్స్ నేర్పుతున్నాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ రాధిక.. 'నీ రిథమ్‌కు నేనింకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను' అనే క్యాప్షన్ పెట్టడంతో పాటు ఈ వీడియో తనకెంతో ప్రత్యేకమైనదని, అందుకే ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తున్నానని చెప్పింది.
 
ప్రేమించుకున్న తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2016లో వివాహం చేసుకుంది. వీరికి డిసెంబ‌ర్ 2, 2018న వారికి బిడ్డ జ‌న్మించింది. రాధిక‌, య‌శ్‌లు ఇద్దరీ టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో 'మొగ్గిన మ‌సు' అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత 'డ్రామా', 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి' 'సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' సినిమాలలో కలిసి నటించారు. యశ్ ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments